![]() |
![]() |

టాలీవుడ్‌లోని హ్యాపీ అండ్ లవ్లీ కపుల్స్‌లో యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ సుమ ముందు వరుసలో ఉంటారు. ఈ రోజు (నవంబర్ 13) రాజీవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా భర్తకు సుమ కనకాల చెప్పిన విషెస్‌లో ఆమె ప్రేమ కనబడుతోంది.
"నా ప్రియమైన రాజా... నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజా... నువ్వే నా బలం, నువ్వే నా సంతోషం. నీతో ఉండటం నా అదృష్టం. నీతో ఉండటానికి ప్రతిరోజూ కొత్త రోజుగా ఎదురు చూస్తున్నా. లవ్యూ" అని ఇన్‌స్టాగ్రామ్‌లో సుమ పోస్ట్ చేశారు.
బుల్లితెరపై యాంకర్ గా సుమ ఫేమస్. వెండితెరపై నటుడిగా రాజీవ్ కనకాల తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. నటుడిగా కొత్త తరహా పాత్రల్లో నటించడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్... ఇలా విలక్షణ పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |