![]() |
![]() |

శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమాల్లో 'మరణ మృదంగం' ఒకటి. అందులో 'పటాస్' ఫేమ్ శ్రుతీ సోది హీరోయిన్. విశేషం ఏమిటంటే... సినిమాలో ఆమెది డ్యూయల్ రోల్. తెలుగులో 'పటాస్', 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సహా పంజాబీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రుతీ సోది ఇప్పటివరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. అందుకని, ఈ సినిమా గురించి బాగా ఎగ్జైట్ అవుతున్నారు.
'మరణ మృదంగం' కోసం బరువు తగ్గుతున్నానని శ్రుతీ సోది తెలిపారు. అలాగే, తన పాత్రలకు సంబంధించి ప్రిపరేషన్ వర్క్ మొదలుపెట్టారట. ప్రస్తుతం తనకు తెలుసు అర్థమవుతుందనీ, త్వరలో తెలుగులో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నానని శ్రుతీ సోది చెబుతున్నారు. 'మరణ మృదంగం' చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది. అందుకోసం హైదరాబాద్ రావడానికి ఆమె రెడీ అవుతున్నారు.
![]() |
![]() |