![]() |
![]() |

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత అక్కినేని టాక్ షో 'సామ్ జామ్' ప్రోమో వీడియో బయటకు వచ్చింది. ఈ షోలో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ విజయ్ దేవరకొండ. ప్రోమో ప్రకారం తాను ప్రస్తుతం సింగిలేనని ఆడియోన్స్‌కు అతను చెబుతున్నాడు. ఈ షో కోసం సమంత ఇప్పటికే టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్, పాపులర్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ రోజే ఫస్ట్ ఎపిసోడ్ ఓటీటీలో విడుదలవుతోంది.
ఇంటర్నెట్‌లో ప్రోమో వీడియో ప్రత్యక్షమయిన క్షణం నుంచి ఆ షో కోసం ఫ్యాన్స్ కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోను హోస్ట్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తొలిసారిగా షేర్ చేశారు. ప్రోమోస్ ప్రకారం చిరంజీవి, అల్లు అర్జున్, తమన్నా, రష్మిక మందన్న లాంటి సినీ స్టార్లతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లాంటి బ్యాడ్మింటన్ స్టార్స్ కూడా గెస్ట్‌లుగా ఈ షోలో కనిపించనున్నారు. దీపావళి కానుకగా ఫస్ట్ ఎపిసోడ్‌ను శుక్రవారం స్ట్రీమింగ్ చేస్తున్నారు. విజయ్‌కు సమంత ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో, వాటికి విజయ్ ఎలాంటి సమాధానాలు చెబుతాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు సమంత. 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె మామయ్య నాగార్జున బ్రేక్ తీసుకోవడంతో ఆయనకు బదులుగా ఆ ఎపిసోడ్‌కు ఆమె హోస్ట్‌గా చేశారు.
![]() |
![]() |