![]() |
![]() |

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కొన్ని ఫీచర్లు భలే ఉంటాయి. ఫేస్ ఫిల్టర్ల దగ్గర నుండి ఫన్నీ ప్రెడిక్షన్స్ వరకూ ఎన్నో అందుబాటులో ఉంటాయి. 'బిగ్ బాస్' ఫేమ్, 'ఉయ్యాలా జంపాలా' మొదలుకుని పలు సినిమాల్లో నటించిన పునర్నవి భూపాలం లేటెస్టుగా ఒక ఫిల్టర్ ట్రై చేశారు. అందులో ఫేస్ స్కాన్ చేసి సెక్స్ అప్పీల్ ఎంత ఉందో చెబుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ పునర్నవి భూపాలం సెక్స్ అప్పీల్ ఎంతుందో కూడా చెప్పింది.
పునర్నవి భూపాలం శుక్రవారం ఉదయం సెక్స్ అప్పీల్ క్యాలిక్యులేటర్ ఫిల్టర్‌ను ట్రై చేశారు. ఆమె ఫేస్ స్కాన్ చేసిన తరవాత 20 శాతం అని వచ్చింది "మా మార్నింగ్ సెక్స్ అప్పీల్... 20 శాతం" అని ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పునర్నవి పోస్ట్ చేశారు. అదీ సంగతి!
సోషల్ సంగతులు పక్కనపెట్టి... యాక్టింగ్ విషయానికి వస్తే, 'కమిట్ మెంటల్' వెబ్ సిరీస్ లో పునర్నవి నటించారు. త్వరలో అది ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల్లోనూ ఆమె నటిస్తున్నారు.
![]() |
![]() |