![]() |
![]() |

తమిళ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన 'అపరిచితుడు' చియాన్ విక్రమ్, అతని భార్య శైల ఆనందంతో ఆకాశంతో విహరిస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే... త్వరలో వాళ్లిద్దరూ తాతయ్య, అమ్మమ్మ కాబోతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
విక్రమ్ కుమార్తె అక్షితను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు మను రంజిత్‌కి ఇచ్చి 2017లో పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. అక్షిత తల్లి కానుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసింది. అతి త్వరలో విక్రమ్, తన ఇంటిలో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీమంతం జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎక్కువమందిని ఆహ్వానించడం లేదు.
విక్రమ్‌కి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. గతేడాది 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'ఆదిత్య వర్మ'తో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయ్యాడు. త్వరలో తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారు.
![]() |
![]() |