![]() |
![]() |

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద నగ్న వీడియోపై నటి మోడల్ పూనమ్ పాండేను దక్షిణ గోవాలో గురువారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత తొలగించిన ఈ వీడియోను చపోలి డ్యామ్ వద్ద చిత్రీకరించారు. ఈ వీడియోలో ఒక్కొక్క వస్త్రాన్నే తీసివేస్తూ పూనమ్ కనిపిస్తుంది. ఈ వీడియో గోవాలో తీవ్ర కలకలం రేపింది. ఆమెపై చర్య తీసుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్ తలెత్తింది. గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్రమించడం, మహిళలను అశ్లీలంగా చిత్రించడం వంటి అభియోగాలు ఆమెపై నమోదు చేశారు.
దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ మాతో మాట్లాడుతూ, "అనుమతి లేకుండా కెనకోనాలోని చపోలి డ్యామ్ దగ్గర అసభ్యకరమైన వీడియో చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ నవంబర్ 2న జల వనరుల శాఖ నుండి ఫిర్యాదు వచ్చింది." అని చెప్పారు. పూనమ్, ఆమె భర్త సామ్ బాంబే అక్టోబర్ 31 తెల్లవారుజామున డ్యామ్ ప్రాంతంలోకి చొరబడి ఆ వీడియోను చిత్రీకరించినట్లు పోలీసులు కనుగొన్నారు.
"ఆమెను కలాంగూట్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండగా ట్రేస్ చేశాం. నవంబర్ 6న కెనకోనా పోలీసుల ముందు హాజరుకావాలని నోటీసు ఇచ్చాం. అయితే దర్యాప్తులో, ఆమె గురువారం మధ్యాహ్నం గోవా నుండి బయలుదేరబోతున్నట్లు తేలింది. దాంతో ఆమెను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నాం "అని సింగ్ తెలిపారు. వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు స్థానిక పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారని, ఈ విషయంలో ఇద్దరు పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేశారనీ వార్తలు వస్తున్నాయి.
![]() |
![]() |