![]() |
![]() |

కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' మూవీ నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంపై విడుదలైంది. 'కేజీఎఫ్' స్టార్ యష్ ఇందులో అతిధి పాత్ర పోషించాడని మీకు తెలుసా? కానీ, ఇది మీరు అనుకుంటున్నట్లుగా కాదు. యష్ మూవీ 'కేజీఎఫ్' పోస్టర్ ఒక సన్నివేశంలో ఇలా కనిపించి అలా మాయమవుతుంది. అయినప్పటికీ యష్ అభిమానులు దీనిని కనిపెట్టేశారు. ఆ ప్రత్యేకమైన స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నిమిషాల వ్యవధిలో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'మిస్ ఇండియా'లో ఒక సన్నివేశంలో మానస సంయుక్త (కీర్తి సురేశ్), ఆమె ఫ్రెండ్ విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) ఓ మాల్‌కు వెళ్తారు. అక్కడ ఓ క్లాత్ షోరూమ్‌లో కొత్త బ్లాక్ గౌన్ వేసుకుని, తన కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది సంయుక్త. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ఆ మాల్‌లోని థియేటర్ దగ్గర 'కేజీఎఫ్' పోస్టర్ కనిపిస్తుంది. అంటే ఈ సినిమా షూటింగ్ యూఎస్‌లో తీసే సమయంలో అక్కడ థియేటర్‌లో 'కేజీఎఫ్' ఆడుతోందన్న మాట. ఈ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన యష్ ఫ్యాన్స్ కీర్తి సురేశ్‌నూ, మిస్ ఇండియా నిర్మాతలనూ ప్రశంసించారు.
![]() |
![]() |