![]() |
![]() |

(ఏప్రిల్ 8 - నిత్యా మీనన్ పుట్టినరోజు సందర్భంగా..)
అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు చిరునామాగా నిలిచే ఈతరం నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నటిగా తనదైన ముద్ర వేసిందీ కేరళకుట్టి.
ఇదిలా ఉంటే, నిత్య కెరీర్ ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. తన తోటి నాయికలతో పోలిస్తే ఎక్కువగా మహిళా దర్శకులతోనే పనిచేసిన వైనం ఉంది నిత్యకి. నందినీ రెడ్డి (అలా మొదలైంది, జబర్దస్త్), అంజనా (సెగ), శ్రీప్రియ (మాలిని 22 పాలైయంకోట్టై), అంజలీ మీనన్ (బెంగళూరు డేస్), సుజనా రావు (గమనం) వంటి ఫిమేల్ డైరెక్టర్స్ తో ఆమె జట్టుకట్టడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు.. `అలా మొదలైంది`తో నందిని, `సెగ`తో అంజనా, `గమనం`తో సుజనా రావు కెప్టెన్స్ గా తొలి అడుగేయడం విశేషం.
ఇక 2014 క్యాలెండర్ ఇయర్ అయితే నిత్యకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ ఏడాది నిత్యా మీనన్ రెండే రెండు సినిమాల్లో నటించగా.. వాటిని మహిళా దర్శకులే తెరకెక్కించడం విశేషం. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం `మాలిని 22 పాలైయంకోట్టై`ని శ్రీప్రియ డైరెక్ట్ చేయగా.. ప్రత్యేక పాత్రలో నటించిన మలయాళ సినిమా `బెంగుళూరు డేస్`ని అంజలీ మీనన్ తెరకెక్కించారు. అలా.. నిత్యకి 2014 మహిళా దర్శకనామ సంవత్సరంగా నిలిచిపోయింది. మొత్తమ్మీద.. మహిళా దర్శకులకు ఫేవరెట్ ఛాయిస్ గా తనదైన ప్రత్యేకతను చాటుతూ వస్తోంది నిత్యా మీనన్. మరి.. భవిష్యత్ లోనూ ఇదే తీరున ఆమె సాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |