![]() |
![]() |
.webp)
భారీ అంచనాల మధ్య మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి 1000 కోట్ల గ్రాస్ కి చేరువైంది. అయితే నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జోరు రోజురోజుకి తగ్గుతూ వస్తోంది. 13 వ రోజుతో పోల్చితే 14 వ రోజు ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యాయి.
11 వ రోజు అయిన రెండో సోమవారం నుంచి ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. రెండో ఆదివారం 44.80 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటిన మూవీ.. సోమవారం12.68 కోట్లు, మంగళవారం 11.58 కోట్లు, బుధవారం 7.44కోట్లకు పడిపోయింది. ఇక 14 వ రోజు అయిన గురువారం నాడు అయితే 6.71 షేర్(14 కోట్ల గ్రాస్)కి పరిమితమైంది. వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేయగా 14 రోజుల్లో 535.21 కోట్ల షేర్(967 కోట్ల గ్రాస్) రాబట్టింది. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో కాస్త పుంజుకొని ఆదివారం రోజు 1000 కోట్ల గ్రాస్ దాటే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ రెండు వారాల్లో 248.76 కోట్ల షేర్(371 కోట్ల గ్రాస్) రాబట్టి 250 కోట్ల షేర్ దిశగా పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 11 వ రోజు 4.98 కోట్లు, 12 వ రోజు 4.88 కోట్ల షేర్ రాబట్టగా.. 13 వ రోజు 2.54 కోట్లు, 14 వ రోజు 1.86 కోట్ల షేర్ కి పడిపోయింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 14 రోజుల్లో 103.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 47.41 కోట్లు రాబట్టి 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 98.2 కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల వైపు దూసుకుపోతోంది. మూడో వారంలో సీడెడ్ లో 50 కోట్లు, ఆంధ్రాలో 100 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 250 మార్క్ ని అందుకోనుంది.
14 రోజుల్లో ఓవర్సీస్ లో 91.25 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 102.10 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 39.80 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 35.40 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 9.90 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 8 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) షేర్ రాబట్టింది. కర్ణాటక మినహా అన్ని చోట్లా రెండు వారాల్లో ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ సాధించింది.
వచ్చే వారం కేజీఎఫ్-2, బీస్ట్, జెర్సీ సినిమాలు వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ చేతిలో ఇంకా ఐదారు రోజులు మాత్రమే ఉన్నాయి. ఆలోపు మరో 40-50 కోట్ల షేర్ రాబట్టి ఓవరాల్ గా బయ్యర్లకు 120 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టనుంది.
![]() |
![]() |