![]() |
![]() |

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా లావణ్య చేసిన ట్వీట్ వీరి ప్రేమ గురించి చర్చ మళ్ళీ మొదలైంది.
'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. 'మిస్టర్' షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని గతంలో లావణ్య పరోక్షంగా ఖండించింది. అయితే ఇప్పుడు ఆమె వరుణ్ ని విష్ చేస్తూ ట్వీట్ చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ టాపిక్ తెరపైకి వచ్చింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వరుణ్ కి, గని మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ లావణ్య ట్వీట్ చేసింది. "వరుణ్ ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నువ్వు, నీ టీం చేసిన హార్డ్ వర్క్ కి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను" అంటూ లావణ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు 'సమ్ థింగ్.. సమ్ థింగ్' అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం తనొక ఫ్రెండ్ గా విష్ చేసిందని అంటున్నారు.
![]() |
![]() |