![]() |
![]() |

ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాతగా 'బాహుబలి' ప్రభాకర్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు(గురువారం) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వై కాశీ విశ్వనాథ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ఫిలిం చాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ.. "రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది అనేది కథాంశం. రెండేళ్ల క్రితం డైరక్టర్ పాలిక్ గారు ఈ కథతో కలిశారు. కరోనా వల్ల అప్పుడు కుదర్లేదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ పాలిక్ గారు ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో నేను హీరో అని చెప్పను కానీ సినిమాకు ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్నా" అన్నారు.

దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ.. "ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న తొలి చిత్రమిది. ముహూర్తపు షాట్ కి క్లాప్ ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, కెమెరా స్విచాన్ చేసిన ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఈ కథ నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఇచ్చారు. తను చెప్పిన లైన్ తో దీన్నొక సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా మలిచి తెరకెక్కిస్తున్నాం. ఒక మేజర్ జీవితంలో ఒక నైట్ ఏం జరిగింది అనేది సినిమా స్టోరి. బాహుబలి ప్రభాకర్ గారిని ఇందులో కొత్త కోణంలో, డ్యూయల్ షేడ్ లో చూస్తారు. ఈ నెలాఖరులో షెడ్యూల్ ప్రారంభిస్తాం. తొలి షెడ్యూల్ గోవాలో రెండో షెడ్యూల్ హైదరాబాద్, అరకులో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.
చలపతి రావు, సుధ, జీవా, సౌజన్య, శైలజా, అనూషా, పల్లవి, సిద్ధు, కామ్నాసింగ్, చంద్ర సిద్ధార్థ ఆర్క, రాజారాం (రఘు) తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా జాన్ భూషణ్, సినిమాటోగ్రాఫర్ గా మల్లిక్ కె చంద్ర వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |