![]() |
![]() |

(ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా..)
ఏప్రిల్ 8.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. అంటే.. అతని అభిమానులకు పండగ రోజు. ఇక `పుష్ప - ద రైజ్`తో పాన్ - ఇండియా హిట్ కొట్టిన సందర్భంలో వస్తున్న బర్త్ డే కావడంతో.. అల్లు అర్జున్ అభిమానులకు ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకం కానుంది. అంతేకాదు.. 1982 ఏప్రిల్ 8న పుట్టిన బన్నీ ఈ రోజుతో 40 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్నారు కూడా.
ఇదిలా ఉంటే, బన్నీకి బర్త్ డే మంత్ (ఏప్రిల్) కెరీర్ పరంగా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ నెలలో వేర్వేరు సంవత్సరాల్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా.. అవన్నీ కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ కురిపించి సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలిచాయి. 2005లో రిలీజైన `బన్ని`తో బర్త్ డే మంత్ లో సందడికి షురూ చేసిన అల్లు అర్జున్.. అటుపై `రేసు గుర్రం` (2014), `సన్నాఫ్ సత్యమూర్తి` (2015), `సరైనోడు` (2016) అంటూ మూడు వరుస సంవత్సరాల్లో ఏప్రిల్ హిట్స్ ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. మరి.. భవిష్యత్ లోనూ అచ్చొచ్చిన బర్త్ డే మంత్ లో అల్లు అర్జున్ విజయాలు కొనసాగిస్తారేమో చూడాలి.
birthday special allu arjun special month,Stylish Star Allu Arjun Birthday,Stylish Star Allu Arjun,Bunny,Race Gurram,son of satyamurthy,sarrainodu
![]() |
![]() |