![]() |
![]() |

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళుగా నటించిన చిత్రం మోసగాళ్ళు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేశారు. మంచు విష్ణు స్వయంగా నిర్మించారు. ఇందులో విష్ణుకి జోడీగా రూహీ సింగ్ నటించగా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తొలుత మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల చేయబోతున్నట్లు వినిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఓ వారం రోజులు వాయిదా పడి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ గా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి.. తన తండ్రి పుట్టినరోజు కానుకగా విడుదలవుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. మంచు విష్ణుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.
![]() |
![]() |