![]() |
![]() |

గత ఏడాది మహాశివరాత్రికి విడుదలైన భీష్మతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు యువ కథానాయకుడు నితిన్. కట్ చేస్తే.. కరోనా ఎఫెక్ట్ తో ఏడాది గ్యాప్ తరువాత కొత్త చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఈ టాలెంటెడ్ హీరో సందడి చేయనున్నారు. ఆ చిత్రాలే.. చెక్, రంగ్ దే.
వాస్తవానికి ఈ రెండు సినిమాల నడుమ తొలుత ఐదు వారాల గ్యాప్ ఉంది. అంటే.. ఫిబ్రవరి 19న చెక్, మార్చి 26న రంగ్ దే ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. నిన్న (బుధవారం) రిలీజ్ చేసిన చెక్ ట్రైలర్ తో ఐదు కాదు నాలుగు వారాల్లోనే నితిన్ ఈ రెండు సినిమాలతో పలకరించబోతున్నారన్నది స్పష్టమైంది. ఫిబ్రవరి 26న చెక్ రానుండగా, మార్చి 26న రంగ్ దే రిలీజ్ కానుంది.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టులతో నితిన్ ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, చెక్ కి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా.. రంగ్ దే ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |