![]() |
![]() |

సినిమాలో కథానుగుణంగా హీరోయిన్లను హీరోలు ఆటపట్టించడం మామూలే! అయితే... సోషల్ మీడియాలో సైతం వదలకుండా సినిమాకు సంబంధించిన ఆట ప్రస్తావన తీసుకురావడం అంటే ఆ హీరోయిన్‌ని హీరో సరదాగా ఆటపట్టిస్తున్నాడని అనుకోవాలి. అసలు వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ లావణ్యా త్రిపాఠి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. డెనిమ్ షార్ట్, స్లీవ్‌లెస్ టీ షర్టులో చాలా బావున్నారు. మోడ్రన్ అమ్మాయిలకు మోడల్ కింద ఉన్న ఆ ఫొటో చాలామందిని ఆకట్టుకుంటోంది. హాట్, లవ్లీ ఎమోజీలతో చాలామంది కామెంట్ చేశారు. ఓ నెటిజన్ అయితే సొట్టబుగ్గల సుందరి అని కామెంట్ చేశాడు. హీరో సందీప్ కిషన్ మాత్రం ‘నీ హాకీ బ్యాట్ ఎక్కడ?’ అని కామెంట్ పెట్టారు. దీనికి ఓ కారణం ఉంది. అదేంటంటే...
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. అందులో లావణ్యా త్రిపాఠి హీరోయిన్. ఇద్దరూ హాకీ ప్లేయర్లుగా నటిస్తున్నారు. అందుకని, ‘నీ హాకీ బ్యాట్ ఎక్కడ?’ అని సందీప్ కామెంట్ చేశారు. అదీ సంగతి!

![]() |
![]() |