![]() |
![]() |

కింగ్ నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ మల్టిస్టారర్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి.. తాజాగా ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేసుకున్నారట. ఇదో మల్టిస్టారర్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమా కోసమై నాగ్, అఖిల్ ని సంప్రదించగా.. సదరు అక్కినేని స్టార్స్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. అంతేకాదు.. కథానుసారం ఇందులో తండ్రీకొడుకులుగానే నాగ్, అఖిల్ కనిపిస్తారట.
కాగా, సంక్రాంతి హిట్ 'సరిలేరు నీకెవ్వరు' తరువాత కొత్త సినిమాని పట్టాలెక్కించని అనిల్.. ఒకవైపు 'ఎఫ్ 2' సీక్వెల్ ని, మరోవైపు రవితేజ కాంబినేషన్ మూవీని ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో నాగ్, అఖిల్ ప్రాజెక్ట్ కూడా చేరడం ఆసక్తిని పెంచుతోంది. మరి.. వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.
![]() |
![]() |