![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కేరళ బ్యూటీ నజ్రీయా ఫాహద్ నాయికగా నటించనున్న ఈ క్రేజీ వెంచర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం పేరుని ఆవిష్కరించనున్నారు.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి 'అంటే సుందరానికి..' అనే టైటిల్ ని వివేక్ ఆత్రేయ అండ్ టీమ్ ఫిక్స్ చేసిందని టాక్. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో ప్రతీ దానికి
తొందరపడే సుందరం అనే యువకుడి పాత్రలో నాని దర్శనమిస్తారట. మరి.. అచ్చ తెలుగు టైటిల్ తో రానున్న నాని - వివేక్ ఆత్రేయ కాంబో.. ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |