![]() |
![]() |

అరవింద సమేత వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తమన్ బాణీలు అందిస్తున్నారు. అయినను పోయి రావలె హస్తినకు అనే పేరు ప్రచారంలో ఉందీ సినిమాకి.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో తారక్ కి జోడీగా ఇద్దరు నాయికలు నటిస్తారని వినికిడి. అందులో ఒకరిగా రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో నాయిక పాత్ర కోసం కీర్తి సురేష్ వైపు మేకర్స్ మొగ్గు చూపిస్తున్నారని బజ్. త్వరలోనే కీర్తి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
తారక్ తో కీర్తి జోడీ కట్టే తొలి చిత్రమిదే కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమా చేశారు కీర్తి. మరి.. తారక్, కీర్తి ఫస్ట్ కాంబినేషన్ ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
![]() |
![]() |