![]() |
![]() |

అఖిల్ అక్కినేని ఈ మద్యే మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అడుగుతూ తన టీజర్‌తో మన ముందుకు వచ్చాడు. ఇప్పడు దీపావళికి చిచ్చుబుడ్డిని పూజా చేత వెలిగింపజేసి అందర్నీ ఆకట్టుకంటున్నాడు. అఖిల్ అక్కినేని టైటిల్ రోల్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తయారవుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే నటిస్తోంది. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేల మద్య వున్న కెమిస్ట్రి ఈ దీపావళి పోస్టర్ తో తెలిసేలా బొమ్మరిల్లు భాస్కర్ తనదైన శైలిలో అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ రోజు ఈ కలర్‌ఫుల్ పోస్టర్ ని విడుదల చేసింది. నిజంగానే ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాకు సంబంధించినది అనిపించకుండా నిజమైన ఫొటోలా అనిపిస్తోందంటే.. అది అఖిల్, పూజా మధ్య కెమిస్ట్రీ మహిమే. ఇద్దరూ పర్‌ఫెక్ట్ జోడీగా కనువిందు చేస్తున్నారు.
మొదట ఈ సినిమాలో పూజా హీరోయిన్ అనగానే అఖిల్ కంటే పెద్దదిగా కనిపిస్తుందేమోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదివరకు అఖిల్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే కులాసాగా కాఫీ తాగుతూ అఖిల్ చెవిని తన కాలితో టచ్ చేస్తున్న పూజ స్టిల్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసినప్పుడు కూడా కొంతమంది పెదవి విరిచారు. కానీ దీపావళి పోస్టర్‌లో ఆ ఇద్దరూ చూడచక్కని జంటగా ఉన్నారని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఇదే కెమిస్ట్రీ తెరపై వర్కవుట్ అయితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో అఖిల్ హిట్ కొట్టడం ఖాయం.
.jpg)
![]() |
![]() |