![]() |
![]() |

2019ని జీరో రిలీజ్ ఇయర్ గా సరిపెట్టిన మాస్ మహారాజా రవితేజ.. ఈ సంవత్సరం ఆరంభంలో డిస్కో రాజాతో సందడి చేశారు. వేసవికి క్రాక్ తో రావాలని ప్లాన్ చేసినా.. కరోనా కారణంగా వాయిదా తప్పలేదు. దీంతో.. 2021 సంక్రాంతికి ఈ కాప్ స్టోరీ థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా.. వచ్చే క్యాలెండర్ ఇయర్ లో మరో రెండు సినిమాలు కూడా రవితేజ నుంచి రావడం పక్కాగా కనిపిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి వేసవిలో విడుదల అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటుంటే.. మారుతితో గానీ నక్కిన త్రినాథరావ్ తో గానీ మాస్ మహారాజా చేయబోయే ప్రాజెక్ట్ సంవత్సరాంతంలో తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు. మొత్తంగా.. రవితేజ ఫ్యాన్స్ కి 2021లో ట్రిపుల్ ధమాకా ఖాయమన్నమాట.
![]() |
![]() |