![]() |
![]() |

బాహుబలి సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మాగ్నమ్ ఓపెస్.. పిరియడ్
డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ దర్శనమివ్వనున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే.. 2021 జనవరి 8న ఈ పాన్ ఇండియా మూవీ థియేటర్స్ లో సందడి చేసేది. కరోనా ఎఫెక్ట్ తో పాటు పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎప్పటికప్పుడు జాప్యం జరుగుతోంది.
కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నాటికి ఈ సినిమా తాలూకూ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా
జరుగుతోందని సమాచారం. ఏప్రిల్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి సారించి 2021 దసరా సీజన్ లో ఆర్ ఆర్ ఆర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసే దిశగా రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ఉన్నారని ఇండస్ట్రీ బజ్.
అంతేకాదు.. షూటింగ్ పార్ట్ పూర్తయ్యాకే విడుదల తేదిని అనౌన్స్ చేస్తారట.
అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు.
![]() |
![]() |