![]() |
![]() |

ద్విశతాధిక చిత్రాల స్వరకర్త యం.యం.కీరవాణి.. ఈ జూన్ 29తో 30 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటున్నారు. ఆయన తొలి చిత్రం 'మనసు మమత' విడుదలై ఈ జూన్ 29కి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. తన 30 ఏళ్ళ కెరీర్లో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు బాణీలు అందించారు కీరవాణి.
'బాహుబలి' సిరీస్‌తో తన కెరీర్లోనే అత్యున్నత విజయాలు చూసిన ఈ దిగ్గజ స్వరకర్త.. ప్రస్తుతం మూడు ఆసక్తికరమైన సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఆ చిత్రాలే.. 'చెక్', 'ఆర్ ఆర్ ఆర్’, పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ మూవీ. వీటిలో 'చెక్'ని మినహాయిస్తే మిగిలిన రెండు చిత్రాలు కూడా పిరియడ్ డ్రామాలు కావడం ఆసక్తికరం. అంతేకాదు ఈ రెండింటిలోనూ మెగా కాంపౌండ్ హీరోలు నటిస్తుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న బడా మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ పిరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కూడా పిరియడ్ డ్రామాగానే రూపొందనుండడం విశేషం. అంటే.. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ రెండు పిరియడ్ డ్రామాల్లోనూ మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నటిస్తున్నారు.
చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ స్నేహం నేపథ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ రూపొందుతుండగా.. పవన్, క్రిష్ కాంబినేషన్ మూవీ మొఘలాయిల పరిపాలన కాలం నాటి కథా ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. మరి.. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు మెగా పిరియడ్ డ్రామాలు.. కీరవాణికి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
![]() |
![]() |