![]() |
![]() |

గత ఏడాది అక్కినేని కాంపౌండ్ మెయిన్ హీరోలు ‘కింగ్’ నాగార్జున, ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్.. ముగ్గురు కూడా రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తోనే పలకరించారు. 'మన్మథుడు 2' అంటూ నాగార్జున జనం ముందుకు వస్తే.. 'మజిలీ'తో రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు నాగ చైతన్య. ఇక వీరిద్దరి కంటే ముందు 'మిస్టర్ మజ్ను'గా పలకరించాడు అఖిల్.
కట్ చేస్తే.. ఈ సంవత్సరం గత ఏడాదికి భిన్నంగా అక్కినేని కాంపౌండ్ పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు కథానాయకులు కూడా వేర్వేరు జానర్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున చేతిలో ఉన్న 'వైల్డ్ డాగ్' (‘ఊపిరి’ రచయిత అహిషోర్ సోల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు) యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా.. నాగ చైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ (శేఖర్ కమ్ముల దర్శకుడు) రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు) ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతోంది. ఇలా.. అక్కినేని కాంపౌండ్ మెయిన్ హీరోలైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురూ కూడా వేర్వేరు జానర్ సినిమాలతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
వాస్తవానికి ఈ మూడు సినిమాలు కూడా వేసవిలోనే రిలీజ్ కావాల్సివుంది. అయితే కరోనా కారణంగా ప్లానింగ్ మారిపోయింది. కాకపోతే అటుఇటుగా ఈ మూడు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మరి.. షార్ట్ గ్యాప్‌లోనే రానున్న ఈ మూడు సినిమాలు అక్కినేని కాంపౌండ్‌కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |