![]() |
![]() |

ఇది మరో పండగ సీజన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సినిమాల విడుదల కోసం సిద్ధంగా ఉంది. అయితే ఆ పండగ థియేటర్లలో కాకుండా ఓటీటీలో జరుగుతుండటమే ఇక్కడ విశేషం. కొవిడ్-19 మహమ్మారి ఇండస్ట్రీని భారీ స్థాయిలో ప్రభావితం చేసినప్పటికీ, ప్రేక్షకులను అలరించే విషయంలో ఏదీ దాన్ని ఆపలేదు. ఈ పరిస్థితిని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. పైగా అవి పేరు పొందిన నటుల సినిమాలను మన ముందుకు తీసుకొస్తున్నాయి.
రిలీజ్ డేట్: నవంబర్ 4
ఫిల్మ్: మిస్ ఇండియా (తెలుగు)
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ సెల్ఫ్-మేడ్ బిజినెస్ వుమన్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చూపిస్తుంది. కొత్త దర్శకుడు వై. నరేంద్రనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్‌ను కీర్తి సురేశ్ పోషించింది. జగపతిబాబు విలన్‌గా కనిపిస్తారు. ఆయనను ఛాలెంజ్ చేసి మరీ మిస్ ఇండియా అనే చాయ్ బ్రాండ్‌ను ఎలా కీర్తి సక్సెస్ చేయించిందనేది ఇతివృత్తం.
రిలీజ్ డేట్: నవంబర్ 9
ఫిల్మ్: లక్ష్మీ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అక్షయ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించే 'లక్ష్మీ' సినిమా ఒక హారర్ కామెడీ. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. అక్షయ్ లుక్స్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేశాయి. రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించగా 2011లో వచ్చిన బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ 'ముని 2: కాంచన'కు ఇది రీమేక్.
రిలీజ్ డేట్: నవంబర్ 12
ఫిల్మ్: ఆకాశం నీ హద్దురా (తెలుగు)
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
'ఆకాశం నీ హద్దురా' అనేది సూర్య నటించిన తమిళ చిత్రం 'సూరారై పొట్రు'కు తెలుగు వెర్షన్. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్, ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ రచించిన 'సింప్లీ ఫ్లై' అనే పుస్తకానికి కాల్పనికతను జోడించి తీసిన సినిమా ఇది. సూర్య సొంత బేనర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్, గునీత్ మోంగాకు చెందిన సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రధారులు.
రిలీజ్ డేట్: నవంబర్ 12
ఫిల్మ్: లుడో (హిందీ)
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
ఈ నెట్‌ఫ్లిక్స్ మూవీలో అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, రోహిత్ సరాఫ్, పియర్లే మానే, ఆషా నేగి లాంటి భారీ తారాగణం నటించింది. విధి ఆడే వింత ఆటలో నలుగురు వ్యక్తుల దారులు ఎలా ఒకచోట కలిశాయనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. అనురాగ్ బసు దీనిని డైరెక్ట్ చేశాడు.
రిలీజ్ డేట్: నవంబర్ 13
ఫిల్మ్: ఛలాంగ్ (హిందీ)
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
హన్సల్ మెహతా డైరెక్ట్ చేసిన 'ఛలాంగ్' ఒక బ్లాక్ కామెడీ డ్రామా. రాజ్‌కుమార్ రావ్, మహమ్మద్ జీషన్ అయూబ్ పోషించిన పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. అజయ్ దేవ్‌గణ్, లవ్ రంజన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
రిలీజ్ డేట్: నవంబర్ 14
ఫిల్మ్: మూకుత్తి అమ్మన్ (తమిళ్)
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రస్తుతం మనదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై చర్చించే రాజకీయ వ్యంగ్య చిత్రంగా దీన్ని ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ సంయుక్తంగా రూపొందించారు. ఆర్జే బాలాజీ, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, స్మృతి వెంకట్, ఊర్వశి కీలక పాత్రధారులు.
![]() |
![]() |