![]() |
![]() |

'ఉన్నది ఒక్కటే జిందగీ', 'హలో గురు ప్రేమ కోసమే'.. ఇలా రామ్ కథానాయకుడిగా నటించిన బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో ఓ హీరోయిన్‌గా నటించింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. బాక్సాఫీస్ వద్ద ఆ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్స్‌తో సరిపెట్టుకున్నా.. ఈ కాంబినేషన్ మాత్రం ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన లక్కీ బ్యానర్ స్రవంతి మూవీస్ సంస్థ ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. రామ్ హీరోగా నటించే ఈ సినిమా కోసమే అనుపమని నాయికగా ఎంపిక చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
అన్నట్టు.. అనుపమ తొలి తెలుగు చిత్రం 'అ ఆ'ని త్రివిక్రమే డైరెక్ట్ చేశారు. ఇందులో సమంత మెయిన్ హీరోయిన్‌గా నటించగా.. సెకండ్ లీడ్‌లో మిస్ పరమేశ్వరన్ సందడి చేసింది.
![]() |
![]() |