![]() |
![]() |

సంగీతదర్శకుడు గోపి సుందర్ ఉన్నాడు కదా! అతడికి మూగ జంతువుల అంటే ఎంతో ప్రేమ!! అంతే ప్రేమగా పెంచుకుంటాడు కూడా!!! ప్రస్తుతం గోపీసుందర్ దగ్గర ఆరు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో నెల వయసు ఉన్న పెంపుడు కుక్కకి 'కరోనా తంగమ్మ' అని పేరు పెట్టారు. స్నేహితుడొకరు తనకి ఈ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారనీ, తన జీవితంలో ఇప్పుడీ కరోనా తంగమ్మ సంతోషం తీసుకొస్తుందని గోపీ సుందర్ చెబుతున్నాడు.
"సాధారణ రోజుల్లో నాకు సంగీత పరమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఖాళీ సమయం దొరకడంతో నా పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నా. ముఖ్యంగా కరోనా తంగమ్మకు ఫుడ్ తినిపించడం, తనతో ఆడుకోవడం వంటివి చేస్తున్నా. మా ఇంట్లో ఒకరు పుట్టిన ఫీలింగ్ కలుగుతోంది" అని గోపీసుందర్ అన్నారు. ప్రకృతి లేకుండా మనుషులు మనుగడ సాధించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచం మనుషులది మాత్రమే కాదని, జంతువులు కూడా జీవించడానికి సమాన హక్కులు కలిగి ఉన్నాయని గోపీసుందర్ పేర్కొన్నారు.
![]() |
![]() |