![]() |
![]() |

కొంత కాలం నుంచీ అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొంత కాలం పాటు వాళ్లు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ప్రీమియర్ సందర్భంగా తొలిసారి కలిసి కనిపించి వార్తల్లో నిలిచారు. అప్పట్నుంచీ వాళ్ల పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏప్రిల్‌లోనే వారు పెళ్లి చేసుకోనున్నారని చాలా మంది చెప్పారు. కానీ ఈ ప్రచారాన్ని రెండు కుటుంబాలకు చెందినవాళ్లూ ఖండించారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, "నేను పెళ్లి చేసుకొనేటప్పుడు ఆ విషయం మీ అందరికీ చెప్తా. ఇప్పటికైతే నా పెళ్లిని ప్లాన్ చేసుకోలేదు. ఒకవేళ మేం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇప్పటి పరిస్థితుల్లో ఎలా వీలవుతుంది?" అని చెప్పాడు అర్జున్. మలైకాలో తనకు నచ్చిన విషయం ఏమిటని అడిగితే, "ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వాళ్లలో ఏం నచ్చిందో చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ల మొత్తం వ్యక్తిత్వాన్ని మనం ప్రేమిస్తాం" అని తెలివిగా జవాబిచ్చాడు. అయినప్పటికీ తన విషయంలో ఆమె చాలా ఓర్పుగా వ్యవహరిస్తుందని చెప్పాడు. ఏడాది పైనుంచే ఆ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. మలైకా ఇదివరకు సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆ మధ్య విడాకులు తీసుకుంది.
![]() |
![]() |