![]() |
![]() |
.jpg)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ కుమార్ గౌడ పెళ్లి మీద అ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ జరిగింది కూడా! హిందీ నటి రవీనా టాండన్ సైతం ఈ పెళ్లి మీద ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు అంటే రచ్చ ఏ స్థాయికి వెళ్లింది అనేది అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం కర్ణాటకలోని రామనగరలోని తమ ఫామ్ హౌస్ లో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. అందులోని ఒక ఫోటోలో వధూవరుల సహా ఎవరు మాస్కులు వేసుకోలేదు. నిఖిల్ తాతయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ ఈ ఫొటోలో ఉన్నారు. ప్రస్తుతం దేశమంతా కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతున్న తరుణంలో కనీసం నిబంధనలను సైతం పాటించకుండా పెళ్లి చేయడం ఏమిటని పలువురు విరుచుకుపడ్డారు.
'పెళ్లిలో ఎవరూ మాస్కులు వేసుకోలేదు ఏంటి? భౌతిక దూరం ఎక్కడ పాటించారు?' అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దేవెగౌడ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. 'పెళ్లికి ఎక్కువ మంది హాజరయ్యారు' అంటూ పలువురు ఆరోపించారు. దాంతో కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప విచారణకు ఆదేశించారు. మరోవైపు దేవగౌడ కుటుంబం విమర్శలను ఖండించింది. శానిటైజర్లు, మాస్కులు పెళ్లిలో ఉపయోగించామని పేర్కొంది. మాస్కులు తీసినప్పటి ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది అని తెలిపింది.
![]() |
![]() |