![]() |
![]() |

దేవసేన అనుష్క నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధంగా ఉంది. పరిస్థితులు మామూలుగా ఉన్నట్లయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలై రెండు వారాలయివుండేది. తాజాగా కమల్ హాసన్ జోడీగా ఒక సినిమాలో ఆమె ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి. కమల్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో 'భారతీయుడు 2' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి టెక్నీషియన్స్ చనిపోయిన ఘటనతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో మరో సినిమా మొదలు పెట్టాలని కమల్ నిర్ణయించుకున్నారు. కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'రాఘవన్' (తమిళ ఒరిజినల్ 'వెట్టైయాడు విలైయాడు') సినిమా చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ స్టోరీతో కమల్‌ను గౌతమ్ కలిశాడు. కమల్ దానిని ఓకే చేశారు. ఇందులో కమల్ జోడీగా అనుష్కను తీసుకున్నారు. గతంలో గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయడానికి అనుష్క అంగీకరించినా, ఆ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడు కమల్ జోడీగా ఆమెను తీసుకున్నాడు గౌతమ్. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |