![]() |
![]() |

సీనియర్ సూపర్‌స్టార్, యంగ్ సూపర్‌స్టార్ కుటుంబం మొత్తం కలిస్తే.. ఎలా ఉంటుంది! ఫొటోలో కనిపిస్తున్నంత అందంగా, కన్నుల పండుగగా ఉంటుందని ఈజీగా చెప్పేయొచ్చు. అవును. కృష్ణ కుటుంబం అంతా ఒక్కచోట చేరింది. ఆయన భార్య ఇందిర, కొడుకు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు.. చివరగా కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. ఈ సందర్భం కృష్ణ చిన్నకుమార్తె, మహేశ్ చెల్లెలు, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని బర్త్‌డేకి తటస్థించింది.
.jpg)
అక్టోబర్ 7 ప్రియదర్శిని బర్త్‌డే. దాంతో కూతురి ఇంటికి మధ్యాహ్నమవుతున్నవేళ కృష్ణ, ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు కలిసి వచ్చారు. అంతకుముందే మహేశ్ - నమత్ర దంపతులు, పద్మావతి-గల్లా జయదేవ్ దంపతులు, మంజుల-సంజయ్ స్వరూప్ దంపతులు వచ్చారు. కృష్ణ భార్య ఇందిర ఆల్రెడీ ప్రియదర్శిని దగ్గరే ఉంటున్నారు. అందరి సమక్షంలో ప్రియదర్శిని బర్త్‌డే కేక్ కట్ చేసింది. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెను కృష్ణ ఆశీర్వదించారు.
.jpg)
ఆ తర్వాత అల్లుళ్లు, కొడుకుతో కలిసి లంచ్ చేశారు కృష్ణ. కొద్దిసేపు అక్కడ గడిపాక అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని తన నివాసానికి బయలుదేరి వెళ్లిపోయారు. మొత్తానికి సూపర్‌స్టార్ ఫ్యామిలీని అంతా ఒక్కచోట చూడటం ఫ్యాన్స్‌కు సంబరాన్నిచ్చింది.
ఈ వేడుకకు సంబంధించిన పిక్చర్లను సుధీర్‌బాబు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. It's that date ... love of my life was born. Happy Birthday Priya అంటూ క్యాప్షన్ పెట్టి, హార్ట్ ఎమోటికాన్‌ను జోడించారు.
.jpg)
![]() |
![]() |