![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి 2020 మే 12న తన ఫియాన్సీ మిహీకా బజాజ్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.. అతనెప్పుడు ఆమెతో లవ్‌లో పడ్డాడా.. అని. "అండ్ షి సెడ్ యస్ (ఆమె సరేనంది) #మిహీకాబజాజ్" అంటూ అతను తమ ఇద్దరి పిక్చర్‌తో పాటు పోస్ట్ చేశాడు. ఆగస్ట్ 8న రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన వేడుకలో కేవలం దగ్గరి బంధువులు 30 మంది సమక్షంలో మిహీకా మెడలో మూడు ముళ్లు వేశాడు రానా.
ఆ ఇద్దరూ ఎప్పుడు ఎలా లవ్‌లో పడ్డారనే విషయాన్ని నిన్నటి దాకా వారు చెప్పలేదు. ఇప్పుడు బాలీవుడ్ తార నేహా ధూపియా తన షో #NoFilterWithNeha లో రానాను ఇంటర్వ్యూ చేసి ఆ విషయాన్ని బయట పెట్టించింది. "చాలా కాలంగా నాకు మిహీకా తెలుసు. ఎలాగంటే మా చెల్లెలు, తను కలిసి స్కూల్‌కు వెళ్లేవారు. కాబట్టి నా లైఫ్‌లో ఆమె నాకు బాగా తెలుసు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన వాళ్లు కొద్దిమందే. లాక్‌డౌన్‌లో మేం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ వచ్చాం. ఇది సరైన సమయం అనిపించి ఆమెకు ప్రపోజ్ చేశాను. తను యస్ చెప్పింది. మంచి విషయాలు జరిగినప్పుడు, నేనెక్కువ క్వశ్చన్ చేయను. అలా వెళ్లిపోతాను. ప్రతి ఒక్కరికీ వాళ్లదైన టైమ్ వస్తుంది. దట్స్ ఫైన్" అని చెప్పాడు రానా.

![]() |
![]() |