![]() |
![]() |

యువరాజు, నిజం, నాని, అర్జున్, శ్రీమంతుడు, మహర్షి.. ఇలా పాత చిత్రాల టైటిల్స్ తో అడపాదడపా సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వీటిలో యువరాజు యావరేజ్ ఫిల్మ్ అనిపించుకోగా.. శ్రీమంతుడు, మహర్షి మంచి విజయం సాధించాయి. కట్ చేస్తే.. మరో పాత టైటిల్ తో మహేష్ సినిమా చేయబోతున్నారట. ఈ సారి.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో పలకరించబోతున్నారట ఈ పోకిరి స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. మహర్షి తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని మహేష్ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. సర్కారు వారి పాట తరువాత వంశీ కాంబో మూవీ పట్టాలెక్కుతుందట. అంతేకాదు.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి స్టేట్ రౌడీ అనే టైటిల్ ని అనుకుంటున్నారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్, టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మహర్షి, స్టేట్ రౌడీ.. ఇలా మహేష్, వంశీ కాంబినేషన్ పాత టైటిల్స్ పైనే మొగ్గు చూపిస్తుండడం ఆసక్తికరమనే చెప్పాలి.
![]() |
![]() |