![]() |
![]() |

రానా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లు దాటింది. 2017 ఆగస్ట్‌లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' ఆయన హీరోగా నటించిన చివరి సినిమా. తేజ డైరెక్ట్ చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. దాని తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో కొద్దిసేపు కనిపించాడు రానా. అయితే ఈ టైమ్‌లో రెండు హిందీ సినిమాలు. 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'హౌస్‌ఫుల్ 4' సినిమాలు చేశాడు. వీటిలో అతను నెగటివ్ రోల్ చేసిన రెండో సినిమా బాగా ఆడింది.
అనారోగ్యం కారణంగా ఈ మధ్యలో తెలుగు సినిమాలేవీ చేయలేకపోయాడు రానా. రెండేళ్లకు పైగా ప్రొడక్షన్‌లో ఉన్న 'అరణ్య' సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతోంది. ఇందులో పాతికేళ్లుగా అడవిలోనే నివాసం ఉంటున్న ఓ అడవి మనిషి లాంటి పాత్రను పోషించాడు రానా. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో తమిళ నటుడు విష్ణు విశాల్ మరో హీరోగా నటించాడు. అడవులను రక్షించుకొని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే కాన్సెప్ట్‌తో ప్రభు సాల్మన్ 'అరణ్య'ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు రానా పాత్ర, అతని నటనే హైలైట్ అవుతుందని ఆయన అంటున్నాడు. ఈ సినిమాతో ఆకట్టుకొని ఆ తర్వాత వచ్చే 'విరాటపర్వం'కు రానా క్రేజ్ తీసుకువస్తాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ.
![]() |
![]() |