![]() |
![]() |

మోహన్‌బాబు అంటే ఒక విలక్షణ నటుడు, ఒక డైలాగ్ కింగ్, ఒక కలెక్షన్ కింగ్. విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు తర్వాత డైలాగ్స్‌ను అంత పవర్‌ఫుల్‌గా చెప్పగలిగిన నటునిగా మోహన్‌బాబు ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఏ డైలాగ్‌ను ఎక్కడ ఎలా విరిచి చెప్పాలో, ఎలా వంచి చెప్పాలో అవపోశన పట్టిన నటుడు మోహన్‌బాబు. ఆయన ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి 45 సంవత్సరాలు గడిచాయి. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, శ్రీరాములయ్య, అడవిలో అన్న తదితర చిత్రాల్లో మోహన్‌బాబు చెప్పే డైలాగ్స్‌కు విజిల్స్ వేయనివాళ్లు, వహ్వా అననివాళ్లు ఎవరు! ఆయన డైలాగ్ డెలివరీకి ఉన్న శక్తి అలాంటిది!
అందుకే తండ్రిని చూసి అసూయ చెందుతుంటాడు మంచు విష్ణు. అవునా.. మోహన్‌బాబును చూస్తే విష్ణుకు అసూయా! అని ఆశ్చర్యపోతున్నారా? నిజం. ఈ విషయాన్ని స్వయంగా విష్ణే తెలిపాడు. గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'అడవిలో అన్న' చిత్రంలో ఓ సీన్లో మోహన్‌బాబు ఫెరోషియస్‌గా చెప్పే ఓ పవర్ఫుల్ డైలాగ్ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన విష్ణు, One of my favorite movie and favorite dialogue. Relevant for any time and age. Jealous of the way he delivers ferocious dialogues! @themohanbabu అంటూ రాసుకొచ్చారు.
ఆ వీడియోలో, విలన్లతో "ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లవురా. దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి, పైరు పెంచి, కోత కోసి, కుప్ప నూర్చి, వడ్లు దంచి వండి పెడితే ఆ పళ్లెం మీదపడి తినే కుక్కవిరా నువ్వు.." అంటూ ఆవేశంగా మోహన్‌బాబు చెప్పే డైలాగులు చూస్తుంటే.. ఒళ్లు జలదరించకుండా ఉండదు.
![]() |
![]() |