![]() |
![]() |

హిందీనాట ఘనవిజయం సాధించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. అంధాధున్. 2018 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా.. ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ కథనం విభాగాల్లో మూడు జాతీయ పురస్కారాలను అందుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుంది. తెలుగు రీమేక్ లో ఆయుష్మాన్ ఖురానా పాత్రలో నితిన్ నటిస్తుండగా.. తమిళ వెర్షన్ లో సీనియర్ హీరో ప్రశాంత్ నటిస్తున్నాడు.
ఇక అంధాధున్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన టబు పోషించిన నెగటివ్ రోల్ ని తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తుండగా.. తమిళ వెర్షన్ కి సంబంధించి ఆ మధ్య ఐశ్వర్యా రాయ్ పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా ఆ పాత్రలో మరో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తోందని కోలీవుడ్ బజ్. త్వరలోనే సిమ్రాన్ ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
కాగా, ప్రశాంత్ - సిమ్రాన్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కన్నెదిరే తొండ్రినాల్, జోడి, పార్తేన్ రసితేన్, తమిళ్ వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. మరి.. ఈ సారి వీరి కాంబోకి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |