![]() |
![]() |

హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి చిత్రంగా సర్కారు వారి పాటని చేయబోతున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ నాయికగా నటించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 25 నుంచి మొదలుకానుందని సమాచారం. హైదరాబాద్ లో ప్రారంభమయ్యే తొలి షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను
చిత్రీకరించి.. ఆనక ఫిబ్రవరిలో గోవా వెళ్ళనుంది యూనిట్. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక.. అమెరికా నేపథ్యంలో మేజర్ పార్ట్ ప్లాన్ చేసారట. మార్చి, ఏప్రిల్ నెలల్లో 40 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ
ఉంటుందని వినికిడి.
మరి.. మహేష్ - కీర్తి సురేష్ - పరశురామ్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |