![]() |
![]() |

బాలీవుడ్ లో ఈ శుక్రవారం రెండు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేయబోతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు కూడా వేర్వేరు పద్ధతుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ డిసెంబర్ 11న అందాల తార కియారా అద్వాని ప్రధాన పాత్రలో నటించిన ఇందూ కీ జవానీ, టాలెంటెడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్ ముఖ్య భూమిక పోషించిన దుర్గామతి చిత్రాలు
విడుదల కానున్నాయి. వీటిలో కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఇందూ కీ జవానీ నేరుగా థియేటర్స్ లో సందడి చేయనుండగా.. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన దుర్గామతి (భాగమతికి రీమేక్ వెర్షన్)
అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ రిలీజ్ గా రాబోతోంది.
మరి.. రెండు వేర్వేరు ప్లాట్ ఫామ్స్ లో రాబోతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |