![]() |
![]() |

తెలుగులో వచ్చిన నవలలు చదివే అతి కొద్దిమంది దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఆయనకు తెలుగు సాహిత్యం, తెలుగు రచనల మీద మంచి పట్టు ఉంది. తాను తీసే చిత్రాలలో తెలుగు మీద అభిమానం కనిపిస్తుంది.
ప్రస్తుతం తెలుగులో వచ్చిన చక్కటి నవలలో ఒకటైన 'కొండపొలం' ఆధారంగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ సినిమా తీస్తున్నారు. దీని తర్వాత మరో నవల ఆధారంగా సినిమా తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారట.
డాక్టర్ కేశవ రెడ్డి రచించిన 'అతడు అడవిని జయించాడు' నవల ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. క్రిష్ కన్ను ఆ నవల మీద పడిందట. తన పందిపిల్ల తప్పిపోవడంతో దాన్ని వెతుకుతూ అడవిలోకి వెళ్ళిన ఒక ముసలి వ్యక్తి కథే 'అతడు అడవిని జయించాడు'. అందులో మనిషికి, అడవికి... మృగానికి మనిషికి మధ్య ఆకలి పోరును కేశవరెడ్డి అద్భుతంగా రాశారు. ఆ నవలను సినిమాగా తీయాలని క్రిష్ భావిస్తున్నాడట.

గతంలోనూ 'అతడు అడవిని జయించాడు' ఆధారంగా సినిమా తీయడానికి కొంతమంది ప్రయత్నాలు చేశారు కానీ సఫలీకృతం కాలేదు. 'కొండపొలం' ఆధారంగా క్రిష్ తీస్తున్న సినిమా విజయవంతమైతే... అది సినిమాగా రావడం పెద్ద కష్టమేమీ కాదు.

![]() |
![]() |