![]() |
![]() |

మహేశ్ సరసన '1.. నేనొక్కడినే' మూవీలో హీరోయిన్‌గా నటించడం ద్వారా సినీ రంగానికి పరిచయమైన పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్‌కు కొవిడ్-19 సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. బుధవారం ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. చండీగఢ్‌లో తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె, తన ఆరోగ్యం గురించిన అప్‌డేట్‌ను పంచుకుంటూ, డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపింది. తన పోస్ట్‌లో త్వరలోనే తను వర్క్‌ని పునరుద్ధరిస్తాననే ఆశాభావం వ్యక్తం చేసింది.
30 ఏళ్ల కృతి తన పోస్ట్‌లో ఏం రాసిందంటే.. "అందరికీ తెలియజేయునది ఏమనగా, నేను కొవిడ్-19 పాజిటివ్‌గా టెస్టులో నిర్ధారణ అయ్యాను. ఏమాత్రం వర్రీ అవ్వాల్సిన పనిలేదు. నేను బాగానే ఉన్నాను. బీఎంసీ (బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ప్రకారం, నా డాక్టర్ల సలహా మేరకు స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లాను. కాబట్టి ఈ మహమ్మారిని అధిగమించి, దానికి రెస్ట్ ఇచ్చి, త్వరలో పనిని పునరుద్ధరిస్తాను. అంతదాకా, అంతదాకా అన్ని దీవెనలు చదువుతున్నాను, అవి పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. క్షేమంగా ఉండండి, మహమ్మారి ఇంకా వెళ్లిపోలేదు."

కృతి కాకుండా, ఇటీవల బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, నీతూ కపూర్, తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కూడా కొవిడ్-19 బారిన పడ్డారు.
![]() |
![]() |