![]() |
![]() |

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం ఈ రాత్రి 7 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో కన్నుల పండుగగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. అక్కడికి రెండు రోజుల ముందే ఒక్క పవన్ కల్యాణ్ మినహా మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేరుకోగా, మంగళవారం రాత్రి ఆయన కూడా వారితో జత కలిశారు. దాంతో మెగా బ్యాచ్ మొత్తం ఉదయ్‌పూర్‌లోనే ఉన్నట్లయ్యింది.

ముగ్గురు మెగా బ్రదర్స్‌తో పాటు వారి కుటుంబాలు, అల్లు అరవింద్, ఆయన కుటుంబం మొత్తం, చిరంజీవి అక్కచెల్లెళ్లు, వారి పిల్లలు అంతా అక్కడే ఉన్నారు. మెగా బ్యాచ్‌లోని మగవాళ్లంతా కలిసి పెళ్లికొడుకు చైతన్యతో గ్రూప్ ఫొటో కూడా దిగారు. బాబాయ్ పవన్ కల్యాణ్ రాకతో నిహారిక ఆనందానికి అంతు లేకుండా పోయింది. మెగా ఫ్యామిలీలో ఇలా డెస్టినేషన్ పెళ్లి జరగడం, దానికి మెగా కాంపౌండ్‌లోని అందరు హీరోలు హాజరవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. పవన్ కల్యాణ్ సైతం చాలా హుషారుగా, ఆనందంగా కనిపించారు. పెళ్లి వేదిక అయిన ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను పంచరంగుల థీమ్‌తో అలంకరిస్తున్నారు. పెళ్లి సమయానికి వేదిక దేదీప్యమానంగా వెలిగిపోయేలా తీర్చిదిద్దుతున్నారు.

ఉదయ్‌పూర్‌లో కనిపించిన మెగా బ్యాచ్‌లోని హీరోలు, నటులు ఎవరెవరంటే.. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్. అన్నట్లు హీరోయిన్లు లావణ్యా త్రిపాఠి, రీతు వర్మ కూడా ఈ పెళ్లికి వచ్చారు.









![]() |
![]() |