![]() |
![]() |
మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘నాయట్టు’ చిత్రాన్ని తెలుగులో ‘కోటబొమ్మాళి పిఎస్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. చాలా కాలం తర్వాత హీరో శ్రీకాంత్‌కి మంచి హిట్ పడిరది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్, సినిమాలోని ‘లింగిడి..’ అనే పాట పెద్ద హిట్ అవ్వడంతో సినిమాపై బజ్ ఏర్పడిరది. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. కలెక్షన్లపరంగా కూడా టాక్ బాగానే వచ్చింది. మలయాళంలో మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో తేజ మార్ని డైరెక్ట్ చేశారు. బన్ని వాస్, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు కూడా దాటక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోందన్నది ఆ వార్త. డిసెంబర్ 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఇటీవలి కాలంలో ఎంతో థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఎంతో స్పీడ్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
![]() |
![]() |