![]() |
![]() |
ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై వారు వీరు అనే తేడా లేకుండా అందరూ స్పందించారు. రష్మికకు మద్దతుగా నిలిచారు. దీని తర్వాత కూడా కొన్ని ఫేక్ వీడియోలు వచ్చినప్పటికీ రష్మిక ఫేక్ వీడియో మాత్రం అందర్నీ అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఢల్లీి పోలీసులు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రష్మిక వీడియో వచ్చిన నాటి నుంచి పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నలుగురే ఆ ఫేక్ వీడియోను అప్‌లోడ్ చేసారని పోలీసుల విచారణలో తేలింది. అయితే దీనికి సూత్రధారి మరొకరు ఉన్నారు. అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ)ను ఉపయోగించి ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఘటనలు ఇటీవలికాలంలో చాలా జరిగాయి. రష్మిక తర్వాత కాజోల్, అలియా భట్ వంటి హీరోయిన్లను సైతం ఎఐ గ్యాంగ్ వదిలిపెట్టలేదు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో ప్రమాదకరమని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకుంది. అందుకే త్వరితగతిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఢల్లీి పోలీసులు తెలియజేశారు.
![]() |
![]() |