![]() |
![]() |

ప్రభాస్ రాజమౌళిల బాహుబలి సిరీస్ భారతీయ చిత్ర పరిశ్రమ తీరుతెన్నులనే మార్చివేసింది. ఇండియన్ సినిమాకి ప్రపంచ వ్యాప్త గుర్తింపుని కూడా ఆ సినిమా తీసుకొచ్చింది. బాహుబలి గా ప్రభాస్ నటన, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది.ఆ సినిమా సాధించిన ఎన్నో రికార్డులు నేటికీ సజీవంగానే ఉన్నాయి. మళ్ళీ ఈ కాంబోలో బాహుబలి 3 రాబోతోందా?
తాజాగా ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ని సలార్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఇంటర్వ్యూ చేసాడు.ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతు నేను ఇప్పటివరకు 4 సినిమాలు తీశాను. ఏ సినిమా రిలీజ్‌కి కూడా టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడు సలార్ సినిమా విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే సలార్‌లో డ్రామా ఎక్కువ ఉంది.. నేను ఇంత డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదు అని అన్నాడు. ఆ తర్వాత రాజమౌళిని ఉద్దేశించి మీ సినిమాల్లో డ్రామా బాగా వర్కవుట్ అవుతుంది బట్ నాకు ఎలా అవుతుందో చూడాలంటు కూడా ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అప్పుడు రాజమౌళి మాట్లాడుతు ప్రభాస్ అనే ఒక్క వ్యక్తి నుంచుంటే చాలు ఎంత హెవీ డ్రామా అయిన నడిచిపోతుంది అని చెప్పాడు.
దీంతో వెంటనే ప్రభాస్ రాజమౌళితో అయితే బాహు బలి 3 ఉన్నట్టే గా అని అడిగే సరికి రాజమౌళి నవ్వుతున ఉన్నాడే గాని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా బాహుబలి 3 రావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా సలార్ సందడి నెలకొని ఉంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సలార్ టికెట్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తండోపతండాలుగా థియేటర్స్ ముందు క్యూ కడుతున్నారు.
![]() |
![]() |