![]() |
![]() |
బుల్లితెరపై పలు షోల ద్వారా, సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన రీతూ చౌదరి ఇప్పుడు ఓ కొత్త సమస్యతో సతమతమవుతోంది. తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఆ వీడియోలు తాను చూశానో లేదోనని తనకే ట్యాగ్ చేస్తున్నారని తెలిపింది. ఆ వీడియోలకు రేటు కట్టి, అంత ఎమౌంట్ ఇస్తేనే ఆ వీడియోలు ఇస్తామని తనని టార్చర్ చేస్తున్నారని చెబుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రీతు యూ ట్యూబ్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవంపై స్పందిస్తూ ‘‘నేను ఏ పోస్ట్ పెట్టినా ‘నీ వీడియో లీక్ అయిందట కదా, వస్తావా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీకాంత్, నేను బయటకు వెళుతున్నప్పుడు.. నా అసభ్యకరమైన వీడియో చూశాను. అది అతడికి చూపిస్తే.. నిజమనుకుంటాడా.. ఆ వీడియోల్లో ఉంది తాను కాదూ అని ప్రూవ్ చేసుకుందామని అనుకున్నా. కానీ శ్రీకాంత్ చాలా సపోర్ట్ చేశాడు. అది నువ్వు కాదని నీ గురించి తెలిసిన వాళ్లకు తెలుసు అంటూ సైబర్ పోలీసుల వద్దకు నన్ను తీసుకెళ్లాడు. నాన్నని కోల్పోయిన తర్వాత ఇంటికి సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోలతో ఇలా టార్చర్ చేస్తున్నారు’’ అంటూ సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు, మేసేజ్‌లు చూపించింది రీతూ. ఈ సమయంలో తన తల్లి, అన్నయ్య చాలా సపోర్టుగా నిలిచారని పేర్కొంది. ‘వాళ్లే లేకపోతే తాను ఎలా డీల్ చేశానో ఇప్పటికీ అర్థం అయ్యేది కాదు. విష్ణుప్రియ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి వీడియోలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్ నుండి పట్టుకొచ్చారు. గతంలో కూడా అతడిని కలిశాను. ఎందుకలా చేశావంటే నాకు తెలియదు అంటున్నాడు. మళ్లీ అతడికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారట. అతడి బావ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అతడు వచ్చి.. చిన్నపిల్లాడు మేడం వదిలేయాలని అడుగుతున్నారు. ఈ విషయంలో సైబర్ పోలీసులు ఎంతో సపోర్ట్ చేశారు. ఎవరైనా మీ వీడియోలు మార్ఫింగ్ చేస్తే సూసైడ్ చేసుకోకండి.. స్ట్రాంగ్‌గా ఉండండి’’ అంటూ అమ్మాయిలకు ధైర్యం చెప్పింది.
![]() |
![]() |