![]() |
![]() |

ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్నమూవీ సర్కారు నౌకరి.శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి అంచనాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా సర్కారీ నౌకరి సంచలనం సృష్టిస్తుంది.
కొంచెంసేపటి క్రితమే సర్కారీ నౌకరి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా కొత్తగా వుండబోతుందనే విషయం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత ప్రజలని జాగృతి చెయ్యబోయే సినిమా రాబోతుందని కూడా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. హీరో ఆకాష్ ఈ మూవీలో ప్రజలకి సుఖ వ్యాధులు కలగకుండా కండోమ్ గురించి ప్రజలకి అవగాహన కలిగించే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. సినిమా మొత్తం తెలంగాణ రాష్టంలోని ఒక గ్రామంలో జరగుతుంది.. అలాగే ఆకాష్ ని అతని భార్య విపరీతంగా ఆరాధించి తర్వాత అతను చేసే ఉద్యోగం తెలుసుకొని చీదరించుకోవడం చూపించడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి
ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఆర్ కె టెలిషో పతాకంపై రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ గోపరాజు సరసన, భావన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి ప్రధాన పాత్ర పోషించాడు.గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్కారీ నౌక జనవరి 1 2024 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.
![]() |
![]() |