![]() |
![]() |

'భరత్ అనే నేను' హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలే 'లక్ష్మీ' మూవీలో అక్షయ్ కుమార్ జోడీగా అలరించింది. తాజాగా ఆమె 'జుగ్ జుగ్ జియో' అనే మూవీ చేస్తోంది. ఇందులో యంగ్ స్టార్ వరుణ్ ధావన్ హీరో. రాజ్ మెహతా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఆ ఇద్దరి ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు బుధవారం రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్‌లో కియారా, వరుణ్ మధ్య కెమిస్ట్రీ అదరహో అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆ స్టిల్స్ సోషల్ మీడియాను ముంచెత్తున్నాయి.
నిర్మాతలు ధర్మా ప్రొడక్షన్స్ రెండు స్టిల్స్‌ను విడుదల చేసింది. ఒక స్టిల్‌లో కియారా, వరుణ్ ఒకరినొకరు పట్టుకొని ఎదురెదురుగా నిల్చొని ఉండగా, మరో స్టిల్‌లో వరుణ్ ఓ చైర్లో కూర్చుంటే, అతడిని కావలించుకొని ఒడిలో కూర్చుంది కియారా. ఇద్దరూ బ్లూ జీన్స్, దాని మ్యాచింగ్ షర్ట్ ధరించారు.
'జుగ్ జుగ్ జియో' మూవీలో అనిల్ కపూర్, నీతు కపూర్ కీలక పాత్రధారులు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కియారా, వరుణ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.

.jpg)
![]() |
![]() |