![]() |
![]() |

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అనేక వివాదాలు, సమస్యలతో ఫిల్మ్ ఇండస్ట్రీ సతమతమవుతోంది. వాటిలో నెపోటిజం నుండి మాదకద్రవ్యాల వరకు అనేక షాకింగ్ కేసులు ఉన్నాయి. అదే సమయంలో, చాలా పెద్ద పేర్లు డ్రగ్ కేసులో చిక్కుకున్నాయి. డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం రియా బెయిల్ మీద బయటకు వచ్చింది. అతని సోదరుడు ఇంకా జైలులో ఉన్నాడు.
డ్రగ్స్ కేసులో నటి సారా అలీ ఖాన్ పేరు కూడా బయటపడింది. ఆమెను ఎన్సీబీ పిలిపించి ప్రశ్నించింది. ఆమె సుశాంత్ అభిమానుల కోపాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చింది. సారాను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. వీటన్నిటి మధ్య సారా అలీఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో అతను తన సోదరికి ధైర్యం చెప్తున్నాడు.
ఇబ్రహీం అలీఖాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. సారాను ఎన్సీబీ ప్రశ్నించిన తర్వాత ఇబ్రహీం పంచుకున్న మొదటి పోస్ట్ ఇది. అతను తన పిక్చర్‌ను ఒకదాన్ని పంచుకున్నాడు. ఈ ఫొటోలో అతను స్విమ్మింగ్‌పూల్‌లో కనిపిస్తున్నాడు. ఆ ఫోటోను పంచుకుంటూ విన్స్టన్ చర్చిల్ ఫేమస్ లైన్ కూడా రాశాడు. "క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా నువ్వు ముందుకే సాగాలి." అనేది ఆ లైన్. అది తన సోదరిని ఉద్దేశించే అతను పెట్టాడని నెటిజన్లు అర్థం చేసుకున్నారు.

సారా, ఇబ్రహీం ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుంటారు. అదే సమయంలో, సారా ఇటీవల తన ఫ్రెండ్స్‌తో సెలవులను ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు వారితో ఇబ్రహీం కూడా ఉన్నాడు.
![]() |
![]() |