![]() |
![]() |

ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఇచట వాహనములు నిలపరాదు'. దీంతో మీనాక్షి చౌధరి తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతోంది. సినిమా చిత్రీకరణ పూర్తి కాకముందే ఆమెకు మరో అవకాశం రాబోతోందని టాక్. అదీ మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించే అవకాశం మీనాక్షికి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.
రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. విజయదశమికి ప్రారంభించాలని అనుకుంటున్నారు. దీనికి 'రాబిన్ హుడ్' టైటిల్
పరిశీలనలో ఉంది. బహుశా... పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైనప్పుడు టైటిల్ ప్రకటిస్తారేమో. మొదట ఇందులో హీరోయిన్లుగా నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్ ను అనుకున్నారు. వాళ్లిద్దరూ
రవితేజతో నటించడం దాదాపు ఖాయమని వినిపించింది. ఇప్పుడు నిధీ అగర్వాల్ బదులు మీనాక్షిని తీసుకుంటున్నారట. ఇటీవల ఆమెకు లుక్ టెస్ట్ కూడా చేశారని సమాచారం. నిధి కంటే మీనాక్షి బెటర్ అని భావిస్తే ఆమెకు అవకాశం వచ్చినట్టే.
![]() |
![]() |