![]() |
![]() |

'బాహుబలి' డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి నేడు (అక్టోబర్ 10) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాజమౌళికి విషెస్ తెలియజేశారు.
'ఆర్ఆర్ఆర్' సెట్స్‌పైకి తాను వచ్చిన తొలిరోజు రాజమౌళితో దిగిన ఫొటోను షేర్ చేసిన దేవ్‌గణ్, హృదయాన్ని టచ్ చేసే ఓ పోస్ట్ పెట్టారు. "మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ రాజమౌళి గారు. మీ గురించి తెలుసుకోవడం, 'ఆర్ఆర్ఆర్'లో మీతో కలిసి పనిచేయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. మీకెప్పకిటీ నా బెస్ట్ విషెస్ సర్ @ssrajamouli" అని ఆయన రాశారు.
వాళ్ల మధ్య బంధం గురించి చెప్పాలంటే, 'ఈగ' సినిమా రోజుల నుంచీ ఆ ఇద్దరూ ఒకరికొకరు తెలుసు. 2012లో 'ఈగ' హిందీ డబ్బింగ్ వెర్షన్ 'మక్ఖీ'కి దేవ్‌గణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రాజమౌళి రూపొందిస్తోన్న లేటెస్ట్ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'లో ఆయన కీలకమైన ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. అది చేయడానికి ఆయన ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వబోతుంటే ఆయన సున్నితంగా తిరస్కరించారనీ, రాజమౌళితో ఉన్న స్నేహంతో ఈ పాత్ర చేస్తున్నాననీ ఆయన చెప్పినట్లు ప్రచారంలోకి వచ్చింది.
![]() |
![]() |