![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి, మరెంతో కష్టపడి చేసిన సినిమా నా పేరు సూర్య. అయితే ఫలితం తీవ్ర నిరాశజనకంగా ఉండడంతో.. తదుపరి చిత్రానికి గ్యాప్ తీసుకున్నాడు. కాదు కాదు.. గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ తరువాత వచ్చిన చిత్రమే.. అల వైకుంఠపురములో. తన లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. బన్నీకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టింది. ఇంకా చెప్పాలంటే.. నాన్ - బాహుబలి రికార్డు సొంతమైంది.
బన్నీ కెరీర్ లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సెన్సేషన్ హిట్స్.. ఇలా ఎన్ని ఉన్నా అల వైకుంఠపురములో లాంటి అసాధారణ విజయమైతే లేదు. 2020 క్యాలెండర్ ఇయర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన ఈ చిత్రంతో, టాప్ క్లాస్ పెర్ ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ హీరో ఆఫ్ ది ఇయర్ అయిపోయాడు. ఇక ఇదే ఏడాది సుకుమార్ డైరెక్టోరియల్ పుష్పని పట్టాలెక్కించిన బన్నీ.. కొరటాల శివ దర్శకత్వంలోనూ ఓ సినిమాని ఓకే చేసేశాడు. అలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. మరి.. 2021లోనూ బన్నీ ఇదే హవాని కొనసాగిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |